Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్‌ కల్యాణ్‌పై ఆర్జీవీ కుట్ర బయటపడింది.. మేము యుద్ధానికి వస్తున్నాం!: బన్నీ వాసు

  • వర్మ ఆడిన డ్రామా గురించి తెలుసుకున్నాను
  • నన్ను నేనే కంట్రో చేసుకోలేకపోతున్నాను
  • మేము బయటకు వస్తున్నాం
'యుద్ధానికి సిద్ధంగా ఉండండి' అంటూ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులకి నిర్మాత బన్నీ వాస్‌ ట్వీట్ చేశాడు. యువనటి శ్రీరెడ్డితో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ... సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ని తిట్టించిన విషయం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ వాస్‌ ట్వీట్ చేస్తూ... 'పవన్ ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరేవాడిని.. కానీ, తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ ఆడిన డ్రామా గురించి తెలుసుకున్న తరువాత నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.

ఇక మేము బయటకు వస్తున్నాం. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. మేమేంటో చూపించడానికి మేము సిద్ధం. మెగా అభిమానులందరితో చర్చించి యుద్ధ ప్రణాళిక ప్రకటిస్తాం' అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, మెగా ఫ్యామిలీ యూనిటీ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రణాళిక త్వరగా వేయండని పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ట్వీట్లు చేస్తున్నారు. 
bunny vas
Pawan Kalyan
Tollywood
RGV

More Telugu News